Monday, December 23, 2024

కొరటాల, ఎన్టీఆర్ మూవీ మోషన్ పోస్టర్ అదిరింది..(వీడియో)

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తన కొత్త మూవీ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్న అభిమానులకు యంగ్ టైగర్ ఎన్టీఆర్ బర్త్ డే గిఫ్ట్ ఇచ్చాడు. శుక్రవారం తన పుట్టినరోజు సందర్భంగా కొత్త మూవీ అప్డేట్ ను అభిమానులతో పంచుకున్నాడు తారక్. తన కొత్త మూవీ మోషన్ పోస్టర్ ను మేకర్స్ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ”అప్పుడ‌ప్పుడు ధైర్యానికి కూడా తెలియ‌దు. అవ‌స‌రానికి త‌ను ఉండ‌కూడ‌ద‌ని.. అప్పుడు భ‌యానికి తెలియాలి.. త‌ను రావాల్సిన స‌మ‌యం వ‌చ్చింద‌ని.. వ‌స్తున్నా” అంటూ ఎన్టీఆర్ చెప్పిన పవర్ ఫుల్ డైలాగ్ ఆకట్టుకుంటోంది. అనిరుధ్ ర‌విచంద‌ర్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా అదిరిపోయింది. దీంతో ఎన్టీఆర్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ, తారక్ కాంబినేషన్ లో భారీ పాన్ ఇండియా చిత్రం తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్ కు ఇది 30వ సినిమా. ఈ మూవీని ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ‌సుధ ఆర్ట్స్ నిర్మాణంలో రూపొందిస్తున్నారు. కాగా, ఈ మూవీకి సంబంధించిన వివరాలను మేకర్స్ త్వరలో వెల్లడించనున్నారు.

NTR 30 Movie Motion Poster Released

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News