Thursday, November 14, 2024

పెగాసస్ స్పైవేర్ కేసు: విచారణ నివేదిక సమర్పణకు సమయం పొడగింపు

- Advertisement -
- Advertisement -
Pegasus Spyware
పలువురు జర్నలిస్టులు, నిపుణులతో సంభాషించడమే కాకుండా 29 మొబైల్ పరికరాలను పరిశీలించినట్లు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఆర్వీ రవీంద్రన్ నేతృత్వంలోని కమిటీ సుప్రీంకోర్టుకు తెలియజేసింది.

న్యూఢిల్లీ: పెగాసస్ అంశాన్ని పరిశీలించడానికి  సుప్రీం కోర్టు నియమించిన సాంకేతిక, పర్యవేక్షక కమిటీ నివేదికను సమర్పించడానికి నెలాఖరు వరకు సమయాన్ని సుప్రీంకోర్టు శుక్రవారం పొడగించింది. స్పైవేర్  “సోకిన”  29 మొబైల్ ఫోన్‌లను పరిశీలించడానికి, ప్రక్రియకు సమయం అవసరమని పేర్కొంది. భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్‌వి రమణ నేతృత్వంలోని ధర్మాసనం ఈ నివేదిక కసరత్తును పర్యవేక్షిస్తున్న మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఆర్‌వి రవీంద్రన్‌కు నివేదికను సమర్పిస్తామని, ఆయన తన వ్యాఖ్యలను జోడించడానికి మరో 15 రోజులు పట్టవచ్చని పేర్కొంది.

“29 మొబైల్ ఫోన్లను పరిశీలిస్తున్నారు. సొంతంగా సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేశారు. వారు ప్రభుత్వం,  జర్నలిస్టులతో సహా ఏజెన్సీలకు నోటీసులు కూడా జారీ చేశారు, అభ్యంతరాలను కూడా ఆహ్వానించారు…కాగా కమిటీ తన నివేదికను సమర్పించడానికి సమయం అర్థించింది. ప్రస్తుతం అది తన  ప్రక్రియలో ఉంది. వారికి సమయం ఇస్తాం’’ అని భారత ప్రధాన న్యాయమూర్తి చెప్పారు.

మొబైల్ పరికరాల పరిశీలనను వేగవంతం చేయాలని, నాలుగు వారాల్లోగా దాని నివేదికను పర్యవేక్షిస్తున్న న్యాయమూర్తికి పంపాలని న్యాయమూర్తులు సూర్యకాంత్ ,  హిమా కోహ్లితో కూడిన ధర్మాసనం కమిటీని కోరింది. గడువు కోసం అభ్యర్థనను అనుమతించిన ధర్మాసనం, ఈ అంశాన్ని తదుపరి జూలైలో విచారిస్తామని తెలిపింది.

గత ఏడాది అక్టోబర్ 27న దీనిపై విచారణకు కమిటీని కోర్టు నియమించింది. అలోక్ జోషి, మాజీ ఐపిఎస్ అధికారి (1976 బ్యాచ్),సందీప్ ఒబెరాయ్, చైర్మన్, సబ్-కమిటీ (ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ స్టాండర్డైజేషన్/ఇంటర్నేషనల్ ఎలక్ట్రో-టెక్నికల్ కమిషన్/జాయింట్ టెక్నికల్ కమిటీ)  విచారణలో జస్టిస్ రవీంద్రన్‌కు సహాయం చేస్తారు.

కమిటీలో ఉన్న ముగ్గురు సాంకేతిక సభ్యులు: నవీన్ కుమార్ చౌదరి, ప్రొఫెసర్ (సైబర్ సెక్యూరిటీ అండ్ డిజిటల్ ఫోరెన్సిక్స్),డీన్, నేషనల్ ఫోరెన్సిక్ సైన్సెస్ యూనివర్సిటీ, గాంధీనగర్, గుజరాత్;  ప్రబాహరన్ పి., ప్రొఫెసర్ (స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్), అమృత విశ్వ విద్యాపీఠం, అమృతపురి, కేరళ; అశ్విన్ అనిల్ గుమాస్తే, ఇన్స్టిట్యూట్ చైర్ అసోసియేట్ ప్రొఫెసర్ (కంప్యూటర్ సైన్స్ మరియు ఇంజనీరింగ్), ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, బొంబాయి, మహారాష్ట్ర.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News