Monday, December 23, 2024

మోడీ ప్రభుత్వం ఒక్క మెడికల్ కాలేజీ ఇవ్వలేదు: హరీష్ రావు

- Advertisement -
- Advertisement -

యాదాద్రి భువనగిరి: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వచ్చి వెళ్లారు తప్పితే ఎయిమ్స్ కోసం కేంద్రాన్ని అడగరని ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ఎద్దేవా చేశారు. యాదాద్రి జిల్లాలో మంత్రి హరీష్ రావు పర్యటించారు. ఎస్ ఎన్ సియు వార్డు, పిల్లల వార్డును మంత్రి ప్రారంభించారు. టి డయాగ్నోస్టిక్ సెంటర్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన  ఎయిమ్స్ కు భూములు బదలాయింపు చేయలేదని కిషన్ రెడ్డి అబద్దాలు మాట్లాడారని, తెలంగాణ ప్రభుత్వం కాగితాలతో సహా చూపిస్తే కిషన్ రెడ్డి నాలుక కరుచుకున్నాడని మండిపడ్డారు.

ఎయిమ్స్ లో సౌకర్యాలు లేక ఎంబిబిఎస్ విద్యార్థులు, రోగులు అవస్థలు పడుతున్నారని, విద్యార్థులకు భువనగిరి ఆస్పత్రిలో ప్రాక్టీస్ చేసేలా అవకాశం కల్పిస్తామన్నారు. సూర్యాపేట, ఇతర మెడికల్ కాలేజీల భవనాలు పూర్తి కావొస్తున్నాయని, ఇక్కడి పరిస్థితులు కేంద్రానికి తెలియజేస్తామన్నారు. గాంధీలో నాలుగు నెలల్లో 48 మందికి మెకాలిచిప్పల సర్జరీలు అభినందనీయమన్నారు. గాంధీ ఆస్పత్రి వైద్యులు, సిబ్బంది ట్విట్టర్ ద్వారా అభినందనలు తెలిపారు. సిఎం కెసిఆర్ పాలనలో పేద ప్రజలకు అత్యాధునిక వైద్యం చేరువైందన్నారు. ప్రజల అవసరాల కోసం ప్రభుత్వం ఎంత ఖర్చు చేసేందుకైనా వెనకాడరన్నారు. ప్రభుత్వాస్పత్రుల్లో ప్రత్యేక విజన్ తో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేశామన్నారు. కెసిఆర్ నాయకత్వంలో ప్రభుత్వాస్పత్రుల్లో వైద్య సేవలు పెరిగాయని, భువనగిరిలో నెలలొపు డయాలసిస్ సెంటర్ ఓపెన్ చేస్తామన్నారు. 20 పడకల న్యూబోర్న్ బేబీ కేర్ సెంటర్ ప్రారంభించామన్నారు.

ప్రభుత్వ ఆస్పత్రుల్లో 26 శాతం ప్రసవాలు పెరిగాయని చెప్పారు. మోడీ ప్రభుత్వం ఇప్పటివరకు ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఇవ్వలేదని మండిపడ్డారు. 33 జిల్లాలకు 33 మెడికల్ కాలేజీలకు సిఎం కెసిఆర్ మంజూరు చేశారన్నారు. ఏడు ఏళ్లలోనే 33 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసుకున్నామన్నారు. బీబీనగర్ ఎయిమ్స్ లో ఒక్క ఆపరేషన్ థియోటర్ కు దిక్కులేదని మండిపడ్డారు. ఎయిమ్స్ ఆస్పత్రిని కేంద్రం పట్టించుకున్న పాపాన పోలేదని ధ్వజమెత్తారు.  వైద్య విద్యార్థులకు కావాల్సిన సదుపాయాలు లేవని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర కిషన్ రెడ్డి బీబీనగర్ ఎయిమ్స్ ఆస్పత్రిపై దృష్టి పెట్టాలన్నారు. భువనగిరి మున్సిపాలిటీకి మరో మూడు బస్తీ దవాఖానాలు ఇస్తామన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News