Friday, December 20, 2024

రూ.8వేల కోట్లు ఫీజు రీయింబర్స్ మెంట్ ఇచ్చాం: కవిత

- Advertisement -
- Advertisement -

MLC Kavitha Speech at Meeting in Korutla

కోరుట్ల: ప్రజలు కోరిన విధంగా కోరుట్ల, మెట్ పల్లి రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేశామని టిఆర్ఎస్ ఎమ్మెల్సీ ‌కల్వకుంట్ల కవిత అన్నారు. శనివారం కోరుట్ల నియోజకవర్గం టీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్సీ ‌కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ”టీఆర్ఎస్ పార్టీకి ‌పెట్టని‌ కోట కోరుట్ల. ప్రజలకు ఇచ్చిన అనేక హామీలు నెరవేర్చాం. వంద పడకల ఆస్పత్రి ఏర్పాటు చేసుకున్నం. కోరుట్లలో ఉన్న బీడీ కార్మికులకు రూ.2 వేల పెన్షన్ ఇస్తున్నం. ఇతర రాష్ట్రాల్లో ఉన్న బీడీ కార్మికులకు ఎందుకు ఇవ్వడం లేదు?.కాంగ్రెస్, బీజేపీ నాయకుల విమర్శకులకు దీటుగా సమాధానం చెప్పాలి. సగర్వంగా, గులాబీ కండుగా మెడలో వేసుకుని టీఆర్ఎస్ నేతలు సమాధానం చెప్పాలి. ఎలాంటి అవినీతి లేకుండా ప్రజలకు పథకాలు అందుతున్నాయి. దేశంలో అవినీతి లేకుండా పాలన అందిస్తున్న నాయకుడు సీఎం కేసీఆర్. తెలంగాణ తెచ్చుకున్నది యువత కోసం. తెలంగాణలో ఉద్యోగాలు 95% స్థానికులకే వచ్చేలా చేసాం. యువత ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్దం కావాలి. దళిత వర్గాలకు దళిత బందు అమలు చేస్తున్నం. 96 లక్షల విద్యార్థులకు 8 వేల కోట్లు ఫీజు రీయింబర్స్ మెంట్ ఇచ్చాం.  టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన కార్యక్రమాలను గ్రామాల్లో చర్చపెట్టాలి. ప్రజాస్వామ్యంలో గెలిచిన వాళ్లకు మర్యాద ఇవ్వాలి. గెలిచిన ఎంపీ అరవింద్ కు 3 ఏండ్లు అవకాశం ఇచ్చినా, రైతులకు ఏం చెయ్యాలేదు. పసుపు బోర్డు బదులు తెచ్చిన ఆఫీస్ కూడా నేను తెచ్చిందే.మనం చేసిన పనులు కూడా, వాళ్ళే చేసినట్టు బీజేపీ నేతలు ప్రచారం చేసుకుంటున్నరు.అబద్దాలకు ప్రతిరూపం అరవింద్. మోడీ హయాంలో పెట్రోల్ నుండి నిత్యావసర వస్తువులు ధరలు భారీగా పెరిగాయి. రూపాయి విలువ భారీగా పడిపోయింది. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు, అందరి అకౌంట్లలో పదిహేను లక్షల రూపాయల లాంటి హామీలు ఏమయ్యాయి?. కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి, బీజేపీని ఎందుకు విమర్శించరు?. పసుపు బోర్డు, ధరల పెరుగుదలపై బీజేపీని ఎందుకు విమర్శించరు?.. మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందేమో?.కాంగ్రెస్ నాయకులు రైతు రచ్చబండ నిర్వహిస్తే, టీఆర్ఎస్ చేసిన అభివృద్ధిని చూపించండి. తెలంగాణకు రావాల్సిన ‌బకాయిల గురించి పార్లమెంటులో మాట్లాడాలని రాహుల్ గాంధీని కోరాల్సిందిగా జీవన్ రెడ్డిని ప్రజలు నిలదీయాలి” అని అన్నారు.

MLC Kavitha Speech at Meeting in Korutla

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News