Saturday, December 21, 2024

గుజరాత్ లో ఘోర రోడ్డు ప్రమాదం..

- Advertisement -
- Advertisement -

ఆరవల్లి: గుజరాత్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శనివారం మధ్యాహ్నం ఆరవల్లి జిల్లాలోని మోడస-ధన్సురా రహదారిపై ప్రమాదవశాత్తు మూడు ట్రక్కులు ఒకదానికొకటి ఢీకొన్నాయి. దీంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో రెండు ట్రక్కులు పూర్తిగా కాలిపోయాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు సజీవ దహనమయ్యారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటినా సంఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు.గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఈఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు.

2 killed after 3 trucks collides each other in Gujarat

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News