Monday, January 13, 2025

నిఖిల్ హై వోల్టేజ్ యాక్షన్..

- Advertisement -
- Advertisement -

నిఖిల్ సిద్ధార్థ్ కధానాయకుడిగా భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న చిత్రం ‘స్పై’ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. గ్యారీ బిహెచ్ దర్శకత్వంలో ఎడ్ ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై నిర్మాత కె. రాజశేఖర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం హై వోల్టేజ్ యాక్షన్ ఎపిసోడ్స్ షూటింగ్ జరుపుకుంటోంది. హాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ జూలియన్ ఎస్ట్రాడాతో పాటు బాలీవుడ్ ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కైకో నకహరా ఈ ఎపిసోడ్స్‌ను తెరకెక్కిస్తున్నారు. హాలీవుడ్ స్టంట్ డైరెక్టర్ లీ విటేకర్ యాక్షన్ సన్నివేశాలను సూపర్‌వైజ్ చేస్తున్నారు. బాలీవుడ్ నటుడు మకరంద్ దేశ్‌పాండే పాటు అభినవ్ గోమతం, ఐశ్వర్యా మీనన్, సన్యా ఠాకూర్‌లు షూటింగ్‌లో పాల్గొంటున్నారు. ఈ చిత్రం తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో దసరాకు ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

Nikhil’s High Voltage Action Sequences for SPY Movie

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News