- Advertisement -
హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వంపై పెట్రోల్ పై బారాణా… చారాణా తగ్గించిందని రాష్ట్ర ఆర్థిక, వైద్య,ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ పై ఎలాంటి పన్నులు పెంచలేదన్నారు. డీజిల్, పెట్రోల్ ధరలు తగ్గించినట్టు చేస్తున్న ప్రచారం బోగస్ అని హరీశ్ రావు అన్నారు. మరోవైపు గ్యాస్ సబ్సీడీ రూ. 400 తగ్గించారని.. సిలిండర్ సబ్సీడీ ఎగ్కోటరని మంత్రి కేంద్ర ఫైర్ అయ్యారు. డాక్టర్లు సూది ఇచ్చినట్లు మెల్లగా పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచారని ఆరోపించారు. ధరలు తగ్గింది అనడం… హంబక్.. బోగస్ అన్నారు. హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ పై రూ.9.83, డీజిల్ పై రూ.7.67 తగ్గింది. ప్రస్తుతం లీటర్ పెట్రోల్ ధర రూ.109.66, లీటర్ డీజిల్ ధర రూ.97.82కి ప్రజలకు అందుబాటులో ఉంది. చమురు ధరలపై కేంద్రం శనివారం ఎక్సైన్ సుంకం తగ్గించింది.
- Advertisement -