Saturday, December 21, 2024

పెట్రో ధరలు పెంచినప్పుడు అడిగారా ?

- Advertisement -
- Advertisement -

Tamil Nadu FM thiagarajan comments on petrol

రాష్ట్రాలు పన్నులు తగ్గించాలనడాన్ని తప్పుబట్టిన తమిళనాడు

చెన్నై : పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించిన కేంద్రం…. రాష్ట్రాలు కూడా పన్నులను తగ్గించాలని కోరడాన్ని తమిళనాడు ఆర్థిక మంత్రి త్యాగరాజన్ విమర్శించారు. ధరలు పెంచినప్పుడు రాష్ట్ర ప్రభుత్వాల అభిప్రాయాల్ని కోరని కేంద్రం ఇప్పుడెందుకు పన్నులు తగ్గించాలని హితబోధ చేస్తోందని వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వం ధరల్ని పెంచినప్పుడు రాష్ట్రాల అభిప్రాయాల్ని తీసుకోలేదు. ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంది. 2014 తరువాత లీటర్ పెట్రోలుపై రూ. 23 (250 శాతం) డీజిల్‌పై రూ. 29 (900 శాతం) కేంద్రం పెంచింది.

ఆ పెంచిన మొత్తం నుంచి ఇప్పుడు కొంత తగ్గించింది పైగా రాష్ట్రాలు కూడా పన్నులు తగ్గించాలని హితబోధ చేస్తోంది. సమాఖ్య స్ఫూర్తి అంటే ఇదేనా ? అని త్యాగరాజన్ ట్విటర్ వేదికగా కేంద్రాన్ని ప్రశ్నించారు. నిత్యావసరాల పెంపునకు , తద్వారా ద్రవ్యోల్బణానికి ఆజ్యం పోస్తున్న పెట్రో ఉత్పత్తుల ధరల పరుగులకు కేంద్ర ప్రభుత్వం కళ్లెం వేసింది. లీటర్ పెట్రోలుపై రూ. 8, డీజిలుపై రూ.6 మేర ఎక్సైజ్ సుంకం తగ్గిస్తున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి సీతారామన్ శనివారం సాయంత్రం ట్విటర్ ద్వారా ప్రకటించారు. దీంతో ఆ రెండు ఇంధనాలు ధర లీటర్‌కు వరుసగా రూ. 9.50, రూ.7 వరకు దిగి వస్తుందని తెలిపారు. ప్రధాన మంత్రి ఉజ్వల్ యోజన లబ్ధిదారులకు ఒక్కో గ్యాస్ సిలిండర్‌పై రూ. 200 (12 సిలిండర్ల వరకు ) రాయితీ కూడా ప్రకటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News