న్యూఢిల్లీ : పెట్రోల్, డీజిల్ పై ఎక్సయిజ్ సుంకం తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో ఆదివారం నుంచి లీటర్ పెట్రోల్‌పై రూ. 8.69, లీటర్ డీజిల్‌పై రూ. 7.05 వంతున ధరలు తగ్గుదల అమలు లోకి వచ్చింది. రికార్డు స్థాయిలో ద్రవ్యోల్బణం పెరగడానికి దారి తీస్తున్న అత్యధిక ఇంధనం ధరలు తగ్గించడంతో వినియోగదారులకు కాస్త ఊరట కలిగించింది. లీటరు పెట్రోలుపై రూ.8, లీటరు డీజిలుపై రూ. 6 వంతున ఎక్సయిజ్ సుంకం తగ్గిస్తున్నట్టు కేంద్రం శనివారం ప్రకటించింది. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.105.41 నుంచి రూ.95.91, లీటర్ డీజిల్ రూ.104.77 నుంచి రూ.96.67 నుంచి రూ. 89.62 కు తగ్గింది. ముంబైలో లీటర్ పెట్రోలు ధర రూ. 120.51 నుంచి రూ. 111.35, లీటర్ డీజిల్ రూ. 104.77 నుంచి రూ.97.28కు తగ్గింది. కోల్‌కతాలో లీటరు పెట్రోలు రూ.106.03 (ఇదివరకు రూ.115.12), లీటరు డీజిల్ రూ.92.76 ( ఇదివరకు రూ.99.83) చెన్నైలో లీటరు పెట్రోల్ రూ.110.85 నుంచి రూ.102.63కు , లీటరు డీజిల్ 100.94 నుంచి రూ.94.24కు ధరలు తగ్గాయి. వ్యాట్ వంటి స్థానిక పన్నుల కారణంగా ఒక రాష్ట్రానికి మరో రాష్ట్రానికి ధరల్లో తేడా ఉంటుంది.