- Advertisement -
లక్నో : వారణాసి లోని జ్ఞానవాపి మసీదు లోపల శివలింగం లేదని సమాజ్ వాది పార్టీ ఎంపి షఫికుర్ రహమాన్ బార్క్ ఆదివారం వాదించారు. అక్కడ శివలింగం ఉందన్న ప్రచారం వచ్చే 2024 పార్లమెంట్ ఎన్నికల్లో మనోభావాలను రెచ్చగొట్టడానికేనని ఆయన వ్యాఖ్యానించారు. ఈ పరిస్థితులన్నీ 2024 ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కల్పించినవేనని పేర్కొన్నారు. చరిత్ర లోకి వెళ్తే జ్ఞానవాపి మసీదులో శివలింగం లేదని తెలుస్తుందన్నారు. అయోధ్య గురించి మాట్లాడుతూ అక్కడ రామాలయం నిర్మాణం జరుగుతున్నా అక్కడ మసీదు ఉందనే తానింకా చెబుతానని పేర్కొన్నారు. తమను లక్షంగా చేసుకుని మసీదులపై దాడులు జరుపుతున్నారని ఆరోపించారు. ప్రభుత్వమంటే ఇలా కాదని, నిజాయితీగా, చట్టప్రకారం ప్రభుత్వ నడవాలని, కానీ బుల్‌డోజర్ ప్రభుత్వమే తప్ప చట్టబద్ధమైనది లేదని ఆరోపించారు.
- Advertisement -