Saturday, April 19, 2025

లండన్ సౌత్‌వార్క్ మేయర్‌గా భారతీయ చోప్రా

- Advertisement -
- Advertisement -

Indian-Origin Man Elected As Mayor In UK

లండన్ : స్థానిక సౌత్‌వార్క్ మేయర్‌గా రెండోసారి భారతీయ సంతతికి చెందిన సునీల్ చోప్రా ఎన్నికయ్యారు. సెంట్రల్ లండన్‌లో ఈ విజయం దక్కించుకున్న చోప్రా ఢిల్లీలో జన్మించారు. లండన్‌లో నాలుగు దశాబ్దాలుగా ఉంటున్నారు. ఇక్కడనే విద్యాభ్యాసం చేస్తూ విద్యార్థి నేతగా ఎన్నికవుతూ వచ్చారు. తరువాత లా చదివారు. కొంత కాలం ఎన్‌ఎస్‌యుఐ ప్రెసిడెంట్‌గా కూడా వ్యవహరించారు. కేవలం రెండు శాతం మంది భారతీయ సంతతి ఓటర్లు ఉన్న స్థానంలో రెండోసారి కూడా చోప్రా గెలిచి ఇక్కడ అధికారి లేబర్ పార్టీ విజయానికి దారి కల్పించారు. 2010లో బ్రిటన్‌లో రాజకీయాలలోకి చురుగ్గా ప్రవేశించిన చోప్రా ఓ ప్రముఖ వ్యాపారవేత్తగా లండన్‌లో అందరికి పరిచితులు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News