Friday, December 20, 2024

జుట్టులేదని పెళ్లి కట్

- Advertisement -
- Advertisement -

Bride refuses to marry ‘bald’ groom

యుపిలో వరుడిని కాదన్న వధువు

లక్నో : నెత్తిన జుట్టు లేనోడితో బతుకు జట్టు కట్టలేనని చెపుతూ పెళ్లి పందిట్లో ఓ వధువు వరుడిని తిరస్కరించింది. ఈ నిజఘటన ఉత్తరప్రదేశ్‌లో ఉన్నావోలో జరిగింది. పెళ్లి వరకూ పెళ్లికొడుకుకు బట్టతల ఉందని చెప్పకుండా దాచిపెట్టినట్లుంది. అయితే పెళ్లి మండపంలో తన ఎదురుగా ఉన్న పెళ్లి కొడుకు ఇసుమంతైనా జుట్టు లేని వాడని గుర్తించిన ఆ పెళ్లి కూతురు పెళ్లి తంతు మధ్యలో ఉండగా తాను తాళి కట్టించుకునేది లేదని తెలిపింది. ఆదివారం తెల్లవారుజామున జరగాల్సిన పెళ్లి ఈ విధంగా వాయిదా పడింది. పెళ్లి కొడుకు మండపంలోకి వచ్చిన తరువాత కళ్లు తిరిగినట్లు అన్పించి పడిపొయ్యాడు. దీనితో విగ్గు కాస్తా కిందపడింది. పెళ్లికూతురు సహా అంతా ఇది గమనించారు. వెంటనే ఆమె తాను ఈ పెళ్లి చేసుకునేది లేదని తేల్చిచెప్పింది. ఇంతదూరం వచ్చి పెళ్లి వద్దనవద్దని అటువైపు వారు ఇటువైపు వారు ఎంతగా చెప్పినా పెళ్లికూతురు వినలేదు.

చివరికి ఈ పెళ్లి తంతు పోలీసు స్టేషన్ వరకూ వెళ్లింది. అయితే పోలీసే కాదు ఎవరు చెప్పినా తాను వినేదిలేదని బట్టతల వాడిని కట్టుకునేది లేదని తేల్చివేసింది. దీనితో పెళ్లి కథ కంచికి చేరింది. పెళ్లికొడుకు వధువు లేకుండానే తన కాన్పూర్‌కు మోగని బారాత్‌తో వెళ్లాల్సి వచ్చింది. ఇటీవలి కాలంలో పెళ్లిళ్ల తంతులో చివరిక్షణాలలో పలు వింతలు జరుగుతున్నాయి. సినీ సీన్లను తలపిస్తున్నాయి. ఓ చోట పెళ్లి కొడుకు తాగుబోతని పెళ్లి ఆగింది. మరో చోట తనను మనువాడే వాడు విపరీతమైన కట్నకానుకలు గుంజుతున్నాడని తెలిసి వధువు పీటల మీది పెళ్లిని కాదంది. ఇదే క్రమంలో పెళ్లి కొడుకులు కూడా పెళ్లి కూతుళ్లను పందిట్లో మంగళవాయిద్యాల మధ్య బలమైన కారణాల నడుమ తిరస్కరించి వారి దారిన వారు వెళ్లారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News