మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కె. తారకరామారావు ఆదివారం రాత్రి దావోస్‌కు చేరుకున్నారు. రేపటి నుంచి జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశాలలో ఆయన పాల్గొంటారు. దావోస్‌కు ముందు నాలుగు రోజుల పాటు లండన్‌లో పర్యటించిన ఆయన పలు ప్రముఖ కంపెనీలతో సమావేశాలు నిర్వహించారు. రాష్ట్రానికి పెద్దఎత్తున పెట్టుబడులను తీసుకొచ్చేందుకు పలు కంపెనీలతో ఒప్పందం చేసుకున్నారు. లండన్ పర్యటన ముగించుకుని దావోస్ చేరుకునేందుకు లండన్ హీత్రో విమానాశ్రయం నుంచి జ్యూరిక్‌కు అక్కడి నుంచి రోడ్డు మార్గంలో దావోస్‌కి చేరుకున్నారు. లండన్ నుంచి వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సమావేశాలకు బయలుదేరిన మంత్రి కెటిఆర్ బృందానికి లండన్‌లోని టిఆర్‌ఎస్ ఎన్‌ఆర్‌ఐ శాఖ కార్యకర్తలు, ఎన్‌ఆర్‌ఐలు పెద్దఎత్తున వీడ్కోలు పలికారు.
కాగా దావోస్‌లో మూడు రోజుల పాటు జరిగే వరల్డ్ ఎకనామిక్ సమావేశాల్లో ప్రధాన సమావేశ మందిరంలో జరిగే పలు జరిగే చర్చల్లో పాల్గొంటారు. తర్వాత 26వ తేదీన స్విట్జర్లాండ్లోని జ్యూరిచ్ నగరంలో పలు కంపెనీల ప్రతినిధులతో సమావేశమవుతారు. అనంతరం హైదరాబాద్‌కు తిరిగి పయణమవుతారు.
ఘనస్వాగతం పలికిన ఎన్నారైలు
వరల్డ్ ఎకానిమిక్ ఫోరం సదస్సు కోసం స్విట్జర్లాండ్‌లోని జ్యూరిక్ నగరానికి చెరుకున్న మంత్పి కెటిఆర్‌కు తెలంగాణ ఎన్నారైలు ఘన స్వాగతం పలికారు. టిఆర్‌ఎస్ పార్టీ, పార్టీ ఎన్నారై స్విట్జర్లాండ్ విభాగంతో పాటు వివిధ రంగాలకు చెందిన ఎన్‌ఆర్‌ఐలు స్వాగతం పలికిన వారిలో ఉన్నారు.