Monday, December 23, 2024

కారుపై పెట్రోల్ పోసుకొని ప్రేమజంట ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: ప్రేమ జంట కారుపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన కర్నాటక రాష్ట్రం ఉడిపి ప్రాంతం బ్రహ్వార తాలూకాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. యశ్వంత్-జ్యోతి కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. వీళ్ల ప్రేమను ఇరుకుంటుంబాలను వ్యతిరేకించడంతో చనిపోవాలని నిర్ణయం తీసుకున్నారు. బెంగళూరు నుంచి ప్రేమ జంట కారులో బయలుదేరారు. హెగ్గుంజే గ్రామ శివారులోకి రాగానే కారుపై పెట్రోల్ పోశారు. అనంతరం ప్రేమజంట కారులో కూర్చొని వాహనానికి నిప్పంటించారు. వాహనదారులు గమనించి తగలబడుతున్న మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అప్పటికే ప్రేమజంట అగ్నికి ఆహుతయ్యారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News