Saturday, December 21, 2024

వైద్యుడిపై సస్పెన్షన్ వేటు వేసిన మంత్రి హరీశ్

- Advertisement -
- Advertisement -

Minister Harish suspends doctor for soliciting bribes

హైదరాబాద్: నగరంలోని కొండాపూర్ ఏరియా ఆస్పత్రిలో వైద్య,ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు సోమవారం ఆకస్మిక తనిఖీలు చేశారు. ఫిట్ నెస్ సర్టిఫికెట్ కు డాక్టర్ మూర్తి డబ్బ అడిగారని బాధితులు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన హరీశ్ రావు వైద్యుడిపై అక్కడికక్కడే సస్పెన్షన్ వేటు వేశారు. ఇలాంటివి మరోసారి జరిగితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. గైనకాలజీ వార్డులో సౌకర్యాలను మంత్రి పరిశీలించారు. 60శాతానికి పైగా సాధారణ డెలివరీలపై మంత్రి హరీశ్ సంతృత్తి వ్యక్తం చేశారు. గైనకాలజీ వార్డులో నిత్యం స్కానింగ్ పరీక్షలు జరపాలని అధికారులను హరీశ్ రావు ఆదేశించారు. కొండాపూర్ ఆస్పత్రికి మరో 2 అల్ట్రాసౌండ్ మిషన్లు పంపుతామని ఆయన పేర్కొన్నారు. ఆస్పత్రిలో సదుపాయాలు ఎలా ఉన్నాయని రోగులను మంత్రి ప్రశ్నించాడు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News