టోక్యో : భారత ప్రధాని నరేంద్రమోడీ సోమవారం జపాన్ చేరుకున్నారు. మంగళవారం జరగబోయే క్వాడ్ సదస్సుల్లో మోడీ పాల్గొననున్నారు. ఇదిలా ఉండగా సోమవారం ఉదయం టోక్యో చేరుకున్న మోడీకి ప్రవాస భారతీయులు మోడీ, మోడీ, వందేమాతరం, భారత్ మాతాకీ జై అని నినాదాలు చేస్తూ ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా జపాన్ బాలుడు మోడీతో హిందీలో మాట్లాడటంతో మోడీ ఆశ్చర్య పోయారు. జపాన్‌కు స్వాగతం.. దయచేసి మీ ఆటోగ్రాష్ నాకు ఇవ్వండి అని రిత్సుకీ కొబయాషీ అనే బాలుడు హిందీలో మోడీని అడిగాడు. దీనికి మోడీ వాహ్ .. మీరు హిందీ ఎక్కడ నుంచి నేర్చుకున్నారు.. మీకు తెలుసా ? అని ప్రశంసించారు. అనంతరం అక్కడున్న జపాన్ విద్యార్థులకు మోడీ ఆటోగ్రాఫ్ ఇచ్చారు. బాలుడు రిత్సుకీ మీడియాతో మాట్లాడుతూ నేను హిందీ ఎక్కువగా మాట్లాడలేను.. కానీ , నాకు అర్థం అవుతుంది. ప్రధాని మోడీ నా సందేశాన్ని చదివారు. నాకు ఆటోగ్రాఫ్ కూడా ఇచ్చారు. దీనికి నాకు సంతోషంగా ఉంది అని తెలిపాడు. తాను ఐదో స్టాండర్డ్ చదువుతున్నట్టు చెప్పాడు.