Friday, December 20, 2024

సింహంతో పరాచికాలాడితే అట్లుంటది…

- Advertisement -
- Advertisement -

Jamaic zoo incident

జమైకా: ఇనుప కంచె నుంచి సింహాన్ని ఆటపట్టిస్తూ పరాచికాలాడిన జమైకాలోని జూకీపర్ వ్రేలును సింహం కొరికేసి పూర్తిగా తెగ్గొట్టింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అయింది. తన చేతిని వెనక్కి లాక్కుందామనుకున్నా ఆ సింహం వదలక కొరికిపారేసింది. జూకొచ్చిన 15 మంది సందర్శకుల ముందే ఇదంతా జరిగింది. అతడు సింహాన్ని ముట్టుకుందామని అతడు ప్రయత్నించగా సింహం దాడి చేసింది. అతడి తోలు, వ్రేలు పూర్తిగా పోయాయని ఓ మహిళా సందర్శకురాలు తెలిపింది. కాగా ఈ ఉదంతంపై దర్యాప్తు జరుపుతామని పమేలా లాసన్ (జంతువుల పట్ల క్రూరత్వంని నిరోధించే సొసైటీ డైరక్టర్) తెలిపారు. ఇదిలావుండగా జూ సందర్శకులకు, అడవి జంతువులకు సురక్షితమైన ప్రదేశమేనని జమైకా జూ ఓ ప్రత్యేక స్టేట్‌మెంట్‌లో స్పష్టం చేసింది. ‘ఇంతకు మునుపెన్నడూ జరగని ఈ సంఘటన దురదృష్టకరం’ అని కూడా జోడించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News