Saturday, December 21, 2024

అంతరాష్ట్ర గంజాయి ముఠా అరెస్టు

- Advertisement -
- Advertisement -

Interstate cannabis gang arrested

470 కిలోల గంజాయి, నాలుగు కార్లు, రూ.2లక్షల నగదు స్వాధీనం
మహిళలకు కమీషన్ ఇచ్చి ట్రాన్స్‌పోర్టు
వివరాలు వెల్లడించిన రాచకొండ అదనపు పోలీస్ కమిషనర్ సుధీర్‌బాబు

మనతెలంగాణ, హైదరాబాద్ : గంజాయి రవాణా చేస్తున్న అంతరాష్ట్ర గంజాయి ముఠాను హయత్‌నగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 470 కిలోల గంజాయి, నాలుగు కార్లు, రూ.2లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు స్వాధీనం చేసుకున్న మొత్తం రూ.1.20 కోట్ల విలువ ఉంటుంది. నేరెడ్‌మెట్‌లోని రాచకొండ పోలీస్ కమిషనరేట్‌లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అదనపు పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు వివరాలు వెల్లడించారు. ఎపిలోని అల్లూరిసీతారామరాజు జిల్లా, రామవరం మండలం, రాజు క్యాంప్ గ్రామానికి చెందిన నయకం రాహుల్ వ్యవసాయం చేస్తున్నాడు, యాదాద్రిజిల్లా, భువనగిరి మండలం, బొల్లేపల్లి గ్రామానికి చెందిన చెరుకుపల్లి శ్రీకాంత్ కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు, సంఘారెడ్డి జిల్లా, జహీరాబాద్ మండలం, సతావార్ గ్రామానికి చెందిన షేక్ నవాజుద్దిన్ కారు డ్రైవర్, కర్ణాటక, బీదర్‌కు చెందిన ఆకాష్ కుమార్, ఎపిలోని ఈస్ట్‌గోదావరికి చెందిన రాజు, సన్యాసిరావు, కర్ణాటక, బీదర్ తాలూక, వినాయక్, నల్గొండ జిల్లాకు చెందిన బానావత్ కిషన్, బానావత్ నాగ, గౌలీకర్ సాయిఅజయ్, సాయినాథ్ చౌహాన్, జెర్రిపోతుల రవలి ప్రైవేట్ ఉద్యోగం చేస్తోంది, మేడ్చెల్ జిల్లా, ఘట్‌కేసర్‌కు చెందిన డోమాటి సంగీత కలిసి గంజాయి రవాణా చేస్తున్నారు.

బీదర్‌కు చెందిన అశోక్ కుమార్, నవాజుద్దిన్ షేక్, వినాయక్, కిషన్, నాగ కలిసి గత ఐదేళ్ల నుంచి గంజాయిని రవాణా చేస్తున్నారు. ఎపి, కర్ణాటక, ఒడిసా, మహారాష్ట్రలో గంజాయి కొనుగోలు దారులతో మంచి సంబంధాలు ఉన్నాయి. ఎపిలోని తూర్పుగోదావరి జిల్లా, డొంకరాయి గ్రామం ఏజెన్సీ నుంచి తక్కు ధరకు గంజాయి కొనుగోలు చేసి ఇతర రాష్ట్రాల వారికి ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారు. రాహుల్, శ్రీకాంత్ గంజాయిని రవాణా చేస్తున్నారు. ఏజెన్సీ ఏరియా నుంచి గంజాయిని హైదరాబాద్ వరకు తీసుకుని వచ్చేందుకు నిందితులు డబ్బులు ఇచ్చి మహిళలను నియమించుకున్నారు. దీనిలో భాగంగా చెరుకుపల్లి శ్రీకాంత్, సాయినాథ్ చౌహాన్, సాయిఅజయ్, రవళి, సంగీత గంజాయిని కొనుగోలు చేసి తీసుకుని వచ్చేందుకు ఏజెన్సీ ఏరియాకు వెళ్లారు.

అక్కడ గంజాయిని కొనుగోలు చేసి రెండు కార్లలో తీసుకుని బయలు దేరారు. వీరు 470 కిలోలను రూ.3,000లకు కొనుగోలు చేసి తీసుకుని వచ్చి మహారాష్ట్ర వారికి రూ.20,000లకు విక్రయిస్తున్నారు. నిందితులు పసుమాముల గ్రామం సమీపంలోని ఓఆర్‌ఆర్ హిల్స్ వద్ద వేరే కారులోకి గంజాయిని మార్చుతుండగా పోలీసులు పట్టుకున్నారు. నిందితులు గతంలో కూడా గంజాయి రవాణా చేశారు. చెరుకుపల్లి శ్రీకాంత్ అలియాస్ కన్నయ్య ఇరవై రోజుల క్రితం 100 కిలోల గంజాయి రవాణా చేశాడు. ఆకాష్ కుమార్, రాజు, సన్యాసి రావు పరారీలో ఉన్నారు. ఇన్స్‌స్పెక్టర్ వెంకటేశ్వర్లు, డిఐ నిరంజన్,ఎస్సైలు సురేష్, సూర్య, నర్సింహులు తదితరులు పట్టుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News