Saturday, December 21, 2024

దళిత పూజారి ఎంగిలి అన్నం తిన్న ఎంఎల్‌ఎ

- Advertisement -
- Advertisement -

Karnataka Cong MLA's gesture against caste discrimination

 

బెంగళూరు : కర్నాటక కాంగ్రెస్ ఎంఎల్‌ఎ జమీర్ ఆహ్మద్ వింత ప్రయత్నం చేశారు. ఓ దళిత పూజారి నోట్లో పెట్టుకున్న ఆహారాన్ని బయటకు తీయించి అదే పదార్థాన్ని జమీర్ తన నోట్లో పెట్టించుకున్నారు. తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసే జమీర్ ఆదివారం చామరాజపేట నియోజకవర్గం పరిధిలో ఈద్ మిలన్, అంబేడ్కర్ జయంతి కార్యక్రమాలు జరిగాయి. ఉత్తరప్రదేశ్‌లో దళితులకు దేవాలయ ప్రవేశం నిషేధం, ప్రసాదం ఇవ్వకపోవడంపై తీవ్రంగా ఖండించారు. ఇదే సందర్భంలో దళిత మఠం నారాయణ స్వామిజీ ఎంగిలి ఆహారాన్ని సేవించి, ఉత్తరప్రదేశ్ సంఘటనను తీవ్రంగా వ్యతిరేకించారు. అన్ని కులాలు, మతాలను ఒకే విధంగా చూడాలని మహాత్మాగాంధీ కలలు కన్నారన్నారు. అప్పుడే దేశం అభివృద్ధి సాధ్యమన్నారు. కాంగ్రెస్ పార్టీ అన్ని మతాలను సమానంగా చూస్తుందన్నారు. బిజెపి వ్యవహారాలు భిన్నంగా ఉన్నాయని మండిపడ్డారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News