మన తెలంగాణ/హైదరాబాద్ : ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు ఢిల్లీ పర్యటన ముగిసింది. ఈ మేర కు ఆయన సోమవారం రాత్రి హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఈ 20వ తేదీన ఢిల్లీ వెళ్లారు. సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌తో దేశ రాజకీయాలపై, భ విష్యత్తు కార్యాచరణపై సుదీర్ఘంగా చర్చలు జరిపారు. అనంతరం పంజాబ్ వెళ్లి రైతు ఉద్యమంలో మరణించిన వారి, గాల్వాన్ లోయ ఘర్షణలో ప్రాణాలు కోల్పోయిన సైనికుల కుటుంబాలకు ఆర్థిక సాయం ఆందజేశారు. పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ఆయన వెంట ఉన్నారు. వ్యవసాయ ఆర్ధిక రంగ నిపుణుడు అశోక్ గులాటితో కెసిఆర్ భేటీ అయ్యారు. వ్యవసాయ రంగం, ఆహార ధాన్యాల కొరత వంటి పలు అంశాలపై ఇరువురు చర్చించినట్లు సమాచారం. అయితే అధికార టిఆర్‌ఎస్ వర్గాల సమాచారం ప్రకారం మరో రెండు, మూడు రోజుల్లోనే సిఎం కెసిఆర్ మరోసారి ఢిల్లీకి వెళ్లే అవకాశం ఉన్నట్లుగా వినపడుతోంది. ముందు గా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం కర్నాటక, బిహార్, తమిళనాడు, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రులను కూడా కలవాల్సి ఉంది.