Friday, December 20, 2024

విశాఖ స్టీల్ ఫ్లాంట్ డిజిఎంపై చైన్ స్నాచర్ల కత్తిపోట్లు

- Advertisement -
- Advertisement -

Chain snatchers stab at Vizag Steel Plant DGM

విశాఖపట్నం: విశాఖపట్నం స్టీల్‌ ప్లాంట్‌ డిజిఎం జి.వెంకట్‌రామ్‌ మనోహర్‌రెడ్డి చైన్ స్నాచింగ్ జరగకుండా అడ్డుకోవడంతో ఆయనకు గాయాలయ్యాయి. సెక్టార్‌ 5 మార్కెట్‌ ఎదురుగా ఉన్న దేవాలయం సమీపంలో మోటార్‌సైకిల్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు మహిళ బంగారు గొలుసు లాక్కెళ్లేందుకు ప్రయత్నించగా, ఓ యువకుడు కేకలు వేసి ప్రజలను అప్రమత్తం చేశాడు. ఆ ప్రాంతంలో భార్యతో కలిసి నడుచుకుంటూ వెళ్తున్న మనోహర్‌రెడ్డి ఓ వ్యక్తిని పట్టుకున్నాడు. ఈ క్రమంలోనే దుండగుడు డీజీఎంపై కత్తితో దాడి చేయడంతో గాయపడ్డాడు. దుండగుడు పారిపోయేందుకు ప్రయత్నించగా స్థానికులు అతడిని పట్టుకుని స్టీల్ ప్లాంట్ పోలీసులకు అప్పగించారు. మనోహర్ రెడ్డిపై దాడికి ఉపయోగించిన కత్తిని కూడా స్వాధీనం చేసుకున్నారు. కాగా, డీజీఎంను స్టీల్ ప్లాంట్ ఆస్పత్రికి తరలించగా, ఆయన పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News