Friday, May 16, 2025

ధూల్ పేట డ్రగ్స్ కేసులో కీలక విషయాలు

- Advertisement -
- Advertisement -

Key points in Dhoolpet Drugs case

హైదరాబాద్: ధూల్ పేట్ డ్రగ్స్ కేసులో పలు కీలక విషయాలు బయటపడ్డాయి. హైదరాబాద్ లో 56 గ్రాముల కొకైన్ ను ఆబ్కారీ అధికారులు పట్టుకున్నారు. ఆఫ్రికన్ తో పాటు ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి రూ.1.28 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. పంజాగుట్ట కేసు నిందితుడు యజ్ఞానంద్ డ్రైవర్ లియాకత్ అరెస్ట్ చేశారు. యజ్ఞానంద్ కోసమే డ్రగ్స్ కొన్నట్టు డ్రైవర్ లియాకత్ తెలిపాడు. నాలుగు నెలల క్రితం యజ్ఞానంద్ ను పంజాగుట్ట పోలీసులు అరెస్ట్ చేశారు. ఇటీవలే బెయిల్ పై నిందితుడు యజ్ఞానంద్ పరారయ్యాడు. నిందితుడి కోసం ధూల్ పేట ఆబ్కారీ అధికారులు గాలిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News