- Advertisement -
ఇల్లెందు: కుటుంబ కలహాల నెపంతో భార్య, కుమారైపై భర్త(సుల్తాన్)కత్తితో దాడి చేసిన సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందులో బుధవారం చోటుచేసుకుంది. భార్య జరీనాను కత్తితో పొడిచి, కుమారై సువ్వి(11)గొంతు కోశాడని స్థానికులు తెలిపారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని విషమ పరిస్థితిలో ఉన్న తల్లి, కుమారైను ఇల్లెందు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు.
- Advertisement -