Friday, November 22, 2024

మెడికల్ సీట్ నిందితుడి అరెస్ట్

- Advertisement -
- Advertisement -

Medical seat accused arrested in hyderabad

సీటు ఇప్పిస్తామని రూ.10,16,000 తీసుకున్న నిందితుడు
నేపాల్‌లో అరెస్టు చేసిన సైబర్ క్రైం పోలీసులు

హైదరాబాద్: మెడిసిన్ సీటు ఇప్పిస్తామని చెప్పి డబ్బులు తీసుకుని మోసం చేసిన యువకుడిని హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. సిసిఎస్ జాయింట్ సిపి గజారావు భూపాల్ తన కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. బీహార్ రాష్ట్రం, సుపోల్ జిల్లా, బీర్‌పూర్ గ్రామానికి చెందిన అశోక్ ఝా నీట్ రాసే విద్యార్థులకు మెడికల్ సీటు ఇప్పిస్తానని చెప్పి మోసం చేస్తున్నాడు. ఈ క్రమంలోనే నగరానికి చెందిన వై. వెన్నెలకు మెసేజ్ పంపించాడు. ఇంటర్ పూర్తి చేసి నీట్ ఎంట్రెన్స్ పరీక్ష రాసి కౌన్సెలింగ్ కోసం ఎదురు చూస్తోంది. తన మొబైల్‌కి బెంగళూరులోని కిమ్స్ మెడికల్ కాలేజీలో సీటు ఇప్పిస్తామని మెసేజ్ వచ్చింది. దీనిని నమ్మిన బాధితురాలు నిందితులు చెప్పినట్లు రూ.10,16,000 బ్యాంక్ ఖాతాకు ట్రాన్స్‌ఫర్ చేసింది. డబ్బులు ముట్టిన తర్వాత నుంచి నిందితులు మొబైల్ ఫోన్‌ను స్విచ్ ఆఫ్ చేసి పరారయ్యారు.

నీట్ రాస్తున్న విద్యార్థులను మోసం చేసేందుకు బెంగళూరులో కార్యాలయాన్ని ప్రారంభించారు. ఇంటర్ పూర్తి చేసి కౌన్సెలింగ్ కోసం ఎదురు చూస్తున్న విద్యార్థులను టార్గెట్‌గా చేసుకుని మోసాలు చేస్తున్నారు. తాము మెడిసిన్ సీటు ఇప్పిస్తామని మొబైల్ ఫోన్‌కు మెసేజ్ పంపించి ఛీటింగ్ చేస్తున్నారు. ఒక వేళా విద్యార్థులు అనుమానం వ్యక్తం చేస్తే వారిని బెంగళూరులోని కార్యాలయానికి పిలిపించుకుని నమ్మిస్తున్నారు. ఇలా చాలామంది విద్యార్థుల నుంచి లక్షలాది రూపాయలు వసూలు చేస్తున్నారు. నిందితులు. వెన్నెల నుంచి డబ్బులు వసూలు చేసిన నిందితుడు నేపాల్‌కు పారిపోయాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేసి నిందితుడి అరెస్టు చేసి తీసుకుని వచ్చారు. ఇన్స్‌స్పెక్టర్ భద్రంరాజు రమేష్, ఎస్సై రవీందర్, పిసిలు మహేష్, ఫిరోజ్, మహేష్‌లు కలిసి పట్టుకున్నారు. విలేకరుల సమావేశంలో ఎసిపి కెవిఎం ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News