Friday, December 20, 2024

మేరీతో జరీన్‌కు రాజీ కుదిరింది..

- Advertisement -
- Advertisement -

Forgetting feud with Mary Kom, Nikhat took fun photo with her

 

న్యూఢిల్లీ: ప్రపంచ బాక్సింగ్ చాంపియన్ నిఖత్ జరీన్‌కు సంబంధించి ఓ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. భారత మహిళా బాక్సింగ్ బాక్సింగ్ దిగ్గజం మేరీకోమ్‌తో దిగిన ఓ ఫొటోను తెలంగాణ ఆణిముత్యం నిఖత్ ట్విటర్‌లో పోస్ట్ చేసింది. మేరీకోమ్‌తో వైరాన్ని మరచి నిఖత్ ఆమెతో సరదగా ఫొటో దిగింది. ఈ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. కాగా టోక్యో ఒలింపిక్‌కు ముందు మేరీకోమ్‌తో నిఖత్‌కు విభేదాలు ఏర్పడ్డాయి. మేరీకోమ్‌కు నేరుగా ఒలింపిక్ బెర్త్‌ను ఖరారు చేయడాన్ని నిఖత్ తప్పుపట్టింది. దీనిపై మేరీకోమ్ తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా నిఖత్‌ను ఘోరంగా అవమానించింది. ఈ అవమానాలను ఛాలెంజ్‌గా తీసుకున్న నిఖత్ తన ఆట తీరును గణనీయంగా మెరుగుపరుచుకుంది. ఈ క్రమంలో స్ట్రాంజా టైటిల్‌తో పాటు మహిళల ప్రపంచ బాక్సింగ్‌లో స్వర్ణం సాధించి చరిత్ర సృష్టించింది. ఇక నిఖత్ సాధించిన విజయాన్ని మేరీకోమ్ స్వాగతించింది. ఈ మేరకు నిఖత్‌ను అభినందించడమే కాకుండా ఫొటోను కూడా దిగింది. దీంతో ఇద్దరి మధ్య నెలకొన్న విభేదాలకు పుల్‌స్టాప్ పడిందనే చెప్పాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News