- Advertisement -
న్యూఢిల్లీ : దేశంలో కరోనా కేసులు నిన్నటికంటే 24 శాతం అధికంగా నమోదయ్యాయి. బుధవారం 4.52 లక్షల మందికి వైద్య పరీక్షలు చేయగా, 2628 మందికి వైరస్ పాజిటివ్‌గా తేలింది. ముందు రోజు కంటే 24 శాతం మేర అధికంగా కేసులొచ్చాయి. బుధవారం 2167 మంది కోలుకున్నారు. కొత్త కేసుల పెరుగుదలతో క్రియాశీల కేసులు 15,444కు ఎగబాకాయి. ప్రస్తుతం క్రియాశీల రేటు 0.04 శాతానికి చేరగా, రికవరీ రేటు 98.75 శాతంగా ఉంది. 24 గంటల వ్యవధిలో 18 మంది మరణించగా, ఇప్పటివరకు 5.24 లక్షల మంది కరోనా మహమ్మారికి బలయ్యారు. ఈ వైరస్ కట్టడికి కేంద్రం ప్రారంభించిన టీకా కార్యక్రమం కింద 192 కోట్లకు పైగా డోసులు పంపిణీ అయ్యాయి. బుధవారం 13.13 లక్షల మంది టీకా వేయించుకున్నారని గురువారం కేంద్రం వెల్లడించింది.
- Advertisement -