మన తెలంగాణ / హైదరాబాద్ : తెలంగాణ కళాకారుల రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశం మే 27న ఉదయం 11.30 గంటలకు హిమాయత్‌నగర్‌లోని ఎఐటియుసి కార్యాలయంలో జరుగుతుందని కళాకారుల సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జిలుకర రవికుమార్ తెలిపారు. కళాకారులందరికీ ఉచిత రైలు, బస్సు సౌకర్యం కల్పించాలని, తెలంగాణ ఉద్యమంలో ఆట, పాట, మాటల ద్వారా తెలంగాణ ప్రజల్లో చైతన్యం నింపి తెలంగాణ సాధనలో పాల్గొన్న అర్హులైన కళాకారులందరికీ ప్రభుత్వోద్యోగాలు కల్పించాలని.
నిరుద్యోగ కళాకారులకు నెలకు రూ.5 వేలు నిరుద్యోగ భృతి ఇవ్వాలని, ఈ విషయమై సమావేశంలో చర్చించనున్నట్లు రవికుమార్ తెలిపారు. వృద్ధ కళాకారులందరికీ పింఛన్లు ఇచ్చి మరుగున పడుతున్న కళలను పునరుజ్జీవం చేయాలన్నారు. అన్ని జిల్లా కేంద్రాల్లో కళా వేదికలను ఏర్పాటు చేయాలని, తెలంగాణ ఉద్యమంలో పాల్గొని ప్రాణ త్యాగం చేసిన 1200 కుటుంబాలను ఆదుకోవాలని, కళాకారులందరికీ డబుల్ బెడ్‌రూం ఇళ్ళు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు.