Tuesday, December 24, 2024

పార్లమెంటులో బిసి బిల్లు పెట్టడానికి కృషి : కృష్ణయ్య

- Advertisement -
- Advertisement -

BC Bill in Parliament

మన తెలంగాణ / హైదరాబాద్ : పార్లమెంటులో బిల్లు పెట్టి చట్టసభల్లో బిసిలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించడానికి కృషి చేస్తానని జాతీయ బిసి సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్. కృష్ణయ్య అన్నారు. ఎపి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆర్. కృష్ణయ్యను రాజ్యసభకు ఎంపిక చేసినందుకు గుజ్జ కృష్ణ ఆధ్వర్యంలో గురువారం హైదరాబాద్ కాచిగూడ లోని గ్రాండ్ హోటల్‌లో కృష్ణయ్యను సన్మానించారు. ఈ సందర్భంగా కృష్ణయ్య మాట్లాడుతూ చట్ట సభల్లో బిసి రిజర్వేషన్ల కోసం పార్లమెంటులో పోరాడుతానని అన్నారు. ఈ సన్మాన కార్యక్రమంలో బిసి నాయకులు పురుషోత్తమ్ సాగర్, కోలా జనార్ధన్, భూపేష్ సాగర్, విజయేంద్ర సాగర్, అశోక్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News