- Advertisement -
డెహ్రాడూన్: కుటుంబ సభ్యులు వేధించడంతో పోలీసులకు ఫోన్ చేసి ఓ మాజీ మంత్రి ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఉత్తరాఖండ్ రాష్ట్రంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఉత్తరాఖండ్ మాజీ మంత్రి రాజేంద్ర బహుగుణ తన కుటుంబ సభ్యులతో కలిసి ఉంటున్నాడు. మనవరాలితో అసభ్యంగా ప్రవర్తించాడని బహుగుణపై సొంత కోడులు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కుటుంబ సభ్యులతో వేధింపులు ఎక్కువ కావడంతో చనిపోవాలని నిర్ణయం తీసుకున్నాడు. ఇంటి పైన ఉన్న ట్యాంక్ ఎక్కి తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని పోలీసులకు ఫోన్ చేశాడు. పోలీసులు బహుగుణ ఉన్న స్థలానికి చేరుకొని ఆత్మహత్య చేసుకోవద్దని సూచించారు. రాజీపడినట్లు కనిపించి వెంటనే తుపాకీతో గుండెలపై కాల్చుకున్నాడు. బహుగుణ కుమారుడు అజయ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కోడలు, ఆమె తండ్రి, పొరుగింటి వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
- Advertisement -