Saturday, December 21, 2024

పోలీసు ఉద్యోగాలకు పరీక్ష తేదీలు ఖరారు

- Advertisement -
- Advertisement -

exam dates for police jobs are finalized in telangana

ఆగస్టు 7న ఎస్‌ఐ, 21న కానిస్టేబుల్ అభ్యర్థులకు పరీక్షలు
16,027 కానిస్టేబుల్ ,587 ఎస్‌ఐ పోస్టులకు 12,91లక్షల దరఖాస్తులు
7.33 లక్షల మంది అభ్యర్థుల నుంచి 12.91 లక్షల దరఖాస్తుల స్వీకరణ
ఎస్‌ఐ పోస్టులకు 2.47 లక్షలు, కానిస్టేబుల్ పోస్టులకు 9.50 లక్షల దరఖాస్తులు
దరఖాస్తుదారుల్లో 2.76 లక్షల మంది మహిళా అభ్యర్థులు

హైదరాబాద్: రాష్ట్ర పోలీసు శాఖలోని ఎస్‌ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాలకు నిర్వహించనున్న ప్రాధమిక పరీక్షల తేదీలను శుక్రవారం నాడు పోలీసు నియామక మండలి ఖరారు చేసింది. ఈక్రమంలో ఆగస్టు 7న ఎస్‌ఐ ప్రాథమిక అర్హత పరీక్ష, 21న కానిస్టేబుల్ ప్రాథమిక అర్హత పరీక్షలు నిర్వహించనున్నట్లు ్ల పోలీసు నియామక మండలి ప్రకటించింది. ఈక్రమంలో పోలీసు ఉద్యోగాలకు సంబంధించి దరఖాస్తుల గడువు గురువారం రాత్రి 10 గంటలకు ముగిసే సమయానికి 7.33 లక్షల మంది అభ్యర్థుల నుంచి 12.91 లక్షల దరఖాస్తుల స్వీకరించినట్లు పోలీసు నియామక మండలి అధికారులు తెలిపారు. రాష్ట్ర పోలీస్, ఎక్సైజ్, జైళ్లు, రవాణా, అగ్నిమాపక శాఖల్లోని ఖాళీగా ఉన్న మొత్తం 17,516 పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ అయిన సంగతి తెలిసిందే. వీటిలో 16,027 కానిస్టేబుల్ పోస్టులు, 587 ఎస్‌ఐ పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టుల కోసం దరఖాస్తు గడువు ముగిసే నాటికి 7.33 లక్షల మంది అభ్యర్థులు 12.91 లక్షల దరఖాస్తులను సమర్పించారని, వీటిలో ఎస్‌ఐ పోస్టులకు 2.47 లక్షలు, కానిస్టేబుల్ పోస్టులకు 9.50 లక్షల దరఖాస్తులు వచ్చాయని అధికారులు తెలిపారు.

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల్లో 3.55 లక్షల మంది ఒకటి కంటే ఎక్కువ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారని, మొత్తం దరఖాస్తు దారుల్లో 2.76 లక్షల మంది మహిళా అభ్యర్థులున్నట్లు పోలీసు నియామక మండలి ప్రకటించింది. కాగా ప్రాధమిక పరీక్షకు సంబంధించి తెలుగులో పరీక్ష రాసేందుకు 67 శాతం మంది అభ్యర్థులు ఆప్షన్ ఇవ్వగా, 32.8 శాతం మంది అభ్యర్థులు ఇంగ్లీష్‌లో పరీక్ష రాసేందుకు దరఖాస్తు చేసుకున్నారు. అదేవిధంగా 0.2% మంది అభ్యర్థులు ఉర్దూను ఎంచుకున్నారని పోలీసు నియామక మండలి అధికారులు తెలిపారు. కాగా పోలీసు ఉద్యోగాలకు హైదరాబాద్, రంగారెడ్డి, నల్లగొండ, ఖమ్మం, సూర్యాపేటకు చెందిన అభ్యర్థులు అత్యధికంగా దరఖాస్తు చేసుకోగా, ములుగు, ఆసిఫాబాద్, భూపాలపల్లి, నారాయణపేట్, జనగాం, రాజన్న సిరిసిల్ల నుంచి దరఖాస్తులు తక్కువగా వచ్చినట్లు అధికారులు గుర్తించారు. ఈక్రమంలో పోలీసు ఉద్యోగాలకు ఒసి 7.65 శాతం. బిసి(ఎ)8.27, బిసి(బి) 17.7, బిసి(సి) 0.26, బిసి(డి)- 20.97, బిసి(ఇ) 4.11, ఎస్‌సి – 22.44, ఎస్‌టిల నుంచి 18.6 శాతం దరఖాస్తులు అందినట్లు రాష్ట్ర పోలీసు నియామక మండలి అధికారులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News