Monday, December 23, 2024

టెక్సాస్ విషాదసుడులు

- Advertisement -
- Advertisement -

Husband suffers heart attack after wife dies

భార్య మృతితో భర్తకు గుండెపోటు

వాషింగ్టన్ : ఇటీవల టెక్సాస్ ఎలిమెంటరీ స్కూల్‌లో ఓ యువకుడు జరిపిన ఉన్మాద కాల్పుల ఘటన పలు విషాదాలకు దారితీసింది. ఈ కాల్పుల్లో దుర్మరణం చెందిన ఓ టీచరు భర్త ఆమెతో ఎడబాటును తట్టుకోలేక గుండెపోటు వచ్చి చికిత్స పొందుతూ మృతి చెందారు. తాను ఎంతగానో ప్రేమించే వ్యక్తి ఈ విధమైన ఘటనలో తనకు దూరం అయిందని, తాను లేకుండా తను ఉండలేనని విలపిస్తూ వచ్చిన భర్త జో కలత చెందుతూ వచ్చి మృతి చెందాడని సన్నిహితులు శుక్రవారం తెలిపారు. టీచరు ఇర్మా గార్సియా ఆనాటి కాల్పుల ఘటనలో దుర్మరణం చెందారు. ఈ ఘటనలో ప్రాణాలు పోయిన విద్యార్థుల తల్లిదండ్రులు ఇప్పటికీ మానసిక క్షోభను భరించలేకపోతున్నారు. ఇదే దశలో మంచి టీచరుగా పేరొందిన తన భార్య కాల్పుల్లో మృతి చెందడం తట్టుకోలేని జో గుండెపగిలేలా రోదించి గుండెపోటుతో కన్నుమూశాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News