Saturday, December 21, 2024

మతం పేరుతో ప్రజలను రెచ్చగొడ్తున్న బిజెపి : జగ్గారెడ్డి

- Advertisement -
- Advertisement -

MLA Jagga Reddy

మన తెలంగాణ / హైదరాబాద్ : మతం పేరుతో బిజెపి ప్రజలను రెచ్చగొడ్తోందని టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి విమర్శించారు. ప్రధాని మోడి రాష్ట్రానికి వస్తే తెలంగాణ పేద ప్రజలకు ఇస్తామన్న 15 లక్షలు ఇవ్వమని, రెండు కోట్ల ఉద్యోగాల గురించి ఎందుకు అడగలేదని ఆయన బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లను నిలదీశారు. గాంధీభవన్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జగ్గారెడ్డి మాట్లాడారు. ఒక్కరోజు కూడా గుడికి పోని బండి సంజయ్ శివలింగం మీద మత రాజకీయం చేస్తున్నాడని విమర్శించారు.

తమిళనాడు సిఎం స్టాలిన్ ప్రధానిని నిలదీసిండని, ముఖ్యమంత్రి కెసిఆర్ ఇక్కడుంటే నిలదీసేవారు కదా అని జగ్గారెడ్డి అన్నారు. ప్రధాని హోదాలో తెలంగాణకు వచ్చిన మోడి ఎటువంటి హామీలు ఇవ్వకుండా కేవలం రాజకీయ విమర్శలు చేయడం సరైంది కాదని అన్నారు. తెలంగాణ సమస్యలను బిజెపి నేతలు ఎందుకు ప్రధాని దృష్టికి తీసుకెళ్ళలేదని ఆయన ప్రశ్నించారు. ప్రధానిని నిలదీసే దమ్ములేని బండి సంజయ్ మసీదులను తవ్వుతాననడం రెచ్చగొట్టడమేని పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News