Monday, January 20, 2025

ప్రీక్వార్టర్ ఫైనల్లో జకోవిచ్, నాదల్

- Advertisement -
- Advertisement -

మెర్టెన్స్, గాఫ్ ముందంజ
ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్

పారిస్: ప్రతిష్టాత్మకమైన ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్‌లో డిఫెండింగ్ చాంపియన్ నొవాక్ జకోవిచ్ (సెర్బియా), మాజీ విజేత రఫెల్ నాదల్ (స్పెయిన్) మూడో రౌండ్‌లో విజయం సాధించారు. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ మూడో రౌండ్‌లో టాప్ సీడ్ జకోవిచ్, ఐదో నాదల్ అలవోక విజయాలు అందుకున్నారు. జకోవిచ్ 63, 63, 62 తేడాతో స్లొవేనియా ఆటగాడు అల్జాజ్ బెడెనెను ఓడించాడు. ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన జకోవిచ్ వరుసగా మూడు సెట్లు గెలిచి ప్రీక్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లాడు. మరో మ్యాచ్‌లో స్పెయిన్ నాదల్ జకోవిచ్ 63, 62, 64 తేడాతో నెదర్లాండ్స్ ఆటగాడు బొటిక్‌పై విజయం సాధించాడు. ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన నాదల్ ఏ దశలోనూ ప్రత్యర్థికి కోలుకునే అవకాశం ఇవ్వలేదు. మూడో సెట్‌లో ప్రత్యర్థి నుంచి కాస్త ప్రతిఘటన ఎదురైనా చివరి వరకు ఆధిక్యాన్ని కాపాడుకుంటూ నాదల్ మ్యాచ్‌ను సొంతం చేసుకున్నాడు. ఇతర పోటీల్లో 9వ సీడ్ ఫెలిక్స్ అగర్ (కెనడా), 15వ సీడ్ డిగో షావార్ట్‌మాన్(అర్జెంటీనా) విజయం సాధించి నాలుగో రౌండ్‌లో ప్రవేశించారు. మహిళల సింగిల్స్‌లో ఎలిసె మెర్టెన్స్ (బెల్జియం), కొకొ గాఫ్ (అమెరికా), అనిసిమోవా (అమెరికా) తదితరులు నాలుగో రౌండ్‌కు చేరుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News