Monday, December 23, 2024

కదంతొక్కిన బట్లర్.. ఫైనల్లో రాజస్థాన్

- Advertisement -
- Advertisement -

అహ్మదాబాద్: ఐపిఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ ఫైనల్‌కు చేరుకుంది. శుక్రవారం జరిగిన క్వాలిఫయర్2 సమరంలో రాజస్థాన్ ఏడు వికెట్ల తేడా తో రాయల్ చాలెంజర్స్ బెంగళూరును చిత్తు చేసి న తుది సమరానికి దూసుకెళ్లింది. ఆదివారం జరిగే ఫైనల్లో గుజరాత్ టైటాన్స్‌తో తలపడుతుంది. తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసిం ది. రజత్ పాటిదార్ (58) ఒక్కడే రాణించాడు. మిగతావారు విఫలం కావడంతో బెంగళూరు ఆ శించిన స్థాయిలో స్కోరును సాధించలేక పోయిం ది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్ 18.1 ఓవర్లలోనే కేవలం మూడు వికెట్లు మాత్రమే కో ల్పోయి విజయం సాధించింది. జోస్ బట్లర్ అజే య శతకంతో జట్టును ఆదుకున్నాడు. విధ్వంసక ఇన్నింగ్స్ ఆడిన బట్లర్ 60 బంతుల్లోనే ఆరు భారీ సిక్సర్లు, మరో పది ఫోర్లతో 106 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. బట్లర్‌కు ఈ సీజన్‌లో ఇ ది మూడో శతకం కావడం విశేషం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News