- Advertisement -
భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి రామయ్యను దర్శించుకోవడానికి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం జరగడంతో ఒక మహిళ చనిపోయింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… మహబూబాబాద్‌కు చెందిన ఓ కుటుంబం భద్రాచలంలో రాముడిని దర్శించుకోవడానికి కారులో వెళ్తున్నారు. ఐటిసి బిపిఎల్ గేటు వద్ద కారు వేగంగా వెళ్లి లారీ వెనక భాగంలో ఢీకొట్టడంతో ఒకరు మృతి చెందగా నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. మృతురాలు పంకజమ్మ(60)గా గుర్తించారు.
- Advertisement -