- Advertisement -
చందూర్: నిజామాబాద్ జిల్లా చందూర్ కల్వర్ట్ ను ఢీకొని బైకుపై వెళ్తున్న పదోతరగతి విద్యార్థి మృతిచెందాడు. కారేగాంతండాకి చెందిన రాజు మంజుల కుమారుడు వికాస్ బీర్కూర్ లోని బిసి గురుకుల పాఠశాలలో చదుతున్నాడు. చివరి పరీక్ష రాయడానికి బైక్ పై ప్రయాణిస్తూ కల్వర్ట్ ఢీకొట్టాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించి అతివేగం, అజాగ్రత్తగా నడపడం వల్లే ప్రమాదం జరిగిందని చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.
- Advertisement -