- Advertisement -
న్యూఢిల్లీ : దేశంలో కరోనా వ్యాప్తి కట్టడి లోనే ఉన్నా హెచ్చుతగ్గులతో కొత్త కేసులు నమోదవుతున్నాయి. శుక్రవారం 4.47 లక్షల మందికి కొవిడ్ పరీక్షలు చేయగా, 2685 మందికి వైరస్ పాజిటివ్‌గా తేలింది. ముందు రోజుకంటే కొత్త కేసులు స్వల్పంగా తగ్గాయి. రోజువారీ పాజిటివిటీ రేటు 0.60 శాతంగా ఉంది. గత 24 గంటల వ్యవధిలో 2158 మంది కోలుకున్నారు. 33 మంది మరణించారు. ఇప్పటివరకు 4.31 కోట్లకు పైగా కేసులు రాగా, అందులో 98.75 శాతం మంది వైరస్ నుంచి కోలుకున్నారు. 5.24 లక్షల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం బాధితుల సంఖ్య 16,308 కి చేరింది. దాంతో క్రియాశీల కేసుల రేటు 0.04 శాతంగా నమోదైంది. ఇప్పటివరకు పంపిణీ అయిన డోసుల సంఖ్య 193 కోట్ల మార్కును దాటింది. ఇందులో శుక్రవారం 14.39 లక్షల మంది టీకా వేయించుకున్నారు.
- Advertisement -