- Advertisement -
అమరావతి: చిత్తూరు జిల్లా విజలాపురం సప్తగిరి గ్రామీణ బ్యాంకులో చోరీ జరిగింది. గ్యాస్ కట్టర్లతో బ్యాంకు షట్టర్ కట్ చేసిన దొంగలు భారీగా నగదు, బంగారం ఎత్తుకెళ్లారు. స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దుండగుల కోసం గాలిస్తున్నారు. సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా నిందితులను పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.
- Advertisement -