Tuesday, November 26, 2024

కూలిపోయిన నేపాల్‌కు చెందిన తారా ఎయిర్‌ విమానం

- Advertisement -
- Advertisement -

Tara Air Plane Crash

న్యూఢిల్లీ: నేపాల్‌లోని పోఖారా నుంచి టిబెట్‌కు ఆనుకుని ఉన్న ముస్తాంగ్ జిల్లాలోని జోమ్‌సోమ్‌కు నలుగురు భారతీయులతో సహా 19మంది ప్రయాణికులతో వెళ్తున్న తారా ఎయిర్‌ప్లేన్ ఆదివారం లేటే హిల్ ఏరియా సమీపంలో కూలిపోయింది.భారతీయులతో పాటు, 9N-AET ట్విన్ ఓటర్ విమానంలో ఇద్దరు జర్మన్లు, 13 మంది నేపాలీలు, ముగ్గురు సిబ్బంది ఉన్నారు. పోఖారా నుంచి ఉదయం 9.50 గంటలకు బయలుదేరిన విమానంతో చివరిసారి కాంటాక్ట్  లేటే పాస్‌లో జరిగింది.

ఖాట్మండులోని భారత రాయబార కార్యాలయం సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్‌లు కొనసాగుతున్నాయని, విమానంలో ఉన్న భారతీయ ప్రయాణికుల కుటుంబాలతో తాము టచ్‌లో ఉన్నామని చెప్పారు. సంఘటనపై మరింత సమాచారం కోసం ఎంబసీ ద్వారా అత్యవసర హాట్‌లైన్ నంబర్ (+977-9851107021) అందించబడింది. సిబ్బందిలో సీనియర్ ఇన్‌స్ట్రక్టర్ పైలట్, కో-పైలట్,  ఎయిర్ హోస్టెస్ కూడా ఉన్నారని తారా ఎయిర్‌లైన్స్ తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News