- Advertisement -
శ్రీనగర్: జమ్ము కశ్మీర్ పుల్వామాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఉగ్రవాదులు జైషే ఉగ్ర సంస్థకు చెందిన వారని కశ్మీర్ ఐజీపీ విజయ్‌కుమార్ తెలిపారు. ఉగ్రవాదుల సమాచారం అందడంతో ఆదివారం రాత్రి భద్రతా బలగాలు, స్థానిక పోలీసుల సంయుక్త బృందం కార్డన్ సెర్చ్ నిర్వహించాయి. ఈ సందర్భంగా ఉగ్రవాదులు, బలగాలకు మధ్య కాల్పులు చోటు చేసుకున్నాయి. ఆదివారం రాత్రి ఓ ఉగ్రవాది హతమయ్యాడు. సోమవారం ఉదయం మరో ఉగ్రవాదిని మట్టుబెట్టారు. వారి వద్ద నుంచి రెండు ఏకే రైఫిల్స్ స్వాధీనం చేసుకున్నట్టు పేర్కొన్నారు. గండిపొరా ప్రాంతంలో ఆదివారం రాత్రి ఎన్‌కౌంటర్ ప్రారంభమైందని పేర్కొన్నారు. రియాజ్ అనే పోలీసును కాల్చి చంపిన ఘటనలో ఈ ఇద్దరు ఉగ్రవాదులు పాల్గొన్నట్టుగా తెలిపారు.
2 Terrorists Killed in Encounter in Pulwama
- Advertisement -