- Advertisement -
మన తెలంగాణ/హైదరాబాద్ : నేతన్నల సంక్షేమ పథకాల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.60 కోట్ల నిధులను విడుదల చేసింది. ఈ మేరకు సోమవారం ప్రభుత్వం తగు ఉత్తర్వులు జారీ చేసింది. మంజూరు చేసిన నిధుల్లో నేతన్నకు చేయూత పథకానికి రూ.30 కోట్లు, చేనేత మిత్రకు రూ. 20 కోట్లు, వీవర్స్ త్రిఫ్ట్ ఫండ్ స్కీంకు రూ. 10 కోట్లు చొప్పున విడుదల చేస్తున్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.
- Advertisement -