విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి, స్టార్ ప్రొడ్యూసర్ దిల్‌రాజు కాంబినేషన్‌లో విడుదలైన సినిమా ‘ఎఫ్ 3’. తాజాగా విడుదలైన ఈ సినిమా ఘన విజయం సాధించింది. ఈ సందర్భంగా బ్లాక్‌బస్టర్ హిట్ వేడుకను హైదరాబాద్‌లో సినిమా యూనిట్ నిర్వహించింది. ఈ వేడుకలో వెంకటేష్ మాట్లాడుతూ.. “నాకు బిగ్ బ్లాక్‌బస్టర్ హిట్ ఇచ్చారు. ప్రేక్షకులు ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్స్‌కు వస్తున్నారు. నా అభిమానులు థియేటర్‌లో నన్ను చూసి మూడేళ్లయింది. నా సినిమా చూసి మనస్ఫూర్తిగా అభినందిస్తున్న ఇండస్ట్రీలోని వారికి థ్యాంక్స్ చెబుతున్నా”అని అన్నారు. వరుణ్ తేజ్ మాట్లాడుతూ.. “ఇలాంటి సినిమా తీసి ఫ్రస్టేషన్ లేకుండా చేసిన దర్శకుడు అనిల్‌కి థ్యాంక్స్. మా ‘ఎఫ్ 3’ కుటుంబ సభ్యులు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు”అని తెలిపారు. దర్శకుడు అనిల్ రావిపూడి మాట్లాడుతూ “ నాకిది 6వ సినిమా. సినిమా విడుదలైన ఉదయమే ఒక ఫోన్ కాల్ వస్తే బ్లాక్‌బస్టర్. నాకు ప్రతిసారి వి.వి. వినాయక్ చేస్తుంటారు. ఇలా ఆరోసారి చేశారు. ఇంకా చాలా మంది ఫోన్‌లు చేశారు. మైత్రీమూవీస్ వారు పర్సనల్‌గా కాల్ చేశారు. డి.సురేష్‌బాబు సినిమా విడుదలకు ముందే చూసి హిట్ అన్నారు. విడుదలైన రోజు నుంచి నేటికీ ఈ సినిమాకు కలెక్షన్ల వర్షం కురుస్తూనే వుంది. ఈ సినిమాకు నా వెన్నంటి వుండి బలంగా నిలబడిన దిల్‌రాజు, శిరీష్‌లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా”అని చెప్పారు. ఈ వేడుకలో రాజేంద్రప్రసాద్, అలీ, శ్రీకాంత్ అయ్యంగార్, ప్రదీప్, ప్రగతి, శ్రీనివాస రెడ్డి, అన్నపూర్ణ, వై.విజయ తదితరులు పాల్గొన్నారు.
F3 Movie Unit Success Meet