మహబూబ్‌నగర్ జైన్ అలిపూర్‌లో దారుణం
మన తెలంగాణ/మహబూబ్‌నగర్: కాపురానికి వెళ్లనన్న నవ వధువును, ఆమెకు సహకరించిన తల్లిని తండ్రి హత్యచేసిన ఘటన మహబూబ్‌నగర్ సమీపంలోని జైన్ అలిపూర్ గ్రామంలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 20 రోజుల కిందట వివాహమైన నవవధువుతోపాటు భార్య కలమ్మను భర్త కృష్ణయ్య రోకలిబండతో కొట్టి హత్య చేశాడు. జైన్ అలిపూర్ గ్రామానికి చెందిన కృష్ణయ్య, కలమ్మ దంపతులకు కుమార్తె సరస్వతి, కుమారుడు ఉన్నారు. ఈనెల 8న మహబూబ్‌నగర్‌కు చెందిన యువకుడితో కుమార్తె సరస్వతికి వివాహం జరిపించారు. పెళ్లి జరిగి వివాహ తంతు పూరైన 10రోజుల తర్వాత నవవధువు ఇంటికొచ్చింది. ఇక అత్తారింటికి వెళ్లనని తల్లిదండ్రులకు ఘరాకండిగా చెప్పింది. కాపురానికి వెళ్లాల్సిందేనని కుమార్తెను కృష్ణయ్య మందలించాడు. లేని పెళ్లి చేశారంటూ సరస్వతి తండ్రితో వాదనకు దిగింది. ఇందుకు కుమార్తెకు తల్లి మద్దతుగా నిలిచింది.
దీంతో కోపాద్రిక్తుడైన కృష్ణయ్య.. కుమార్తె సరస్వతి(23), భార్య కలమ్మ(43)ను రోకలిబండతో కొట్టాడు. అనంతరం అతను పురుగుల మందు తాగాడు. ఇదే విషయాన్ని పొలంలో ఉన్న కుమారుడికి ఫోన్‌చేసి చెప్పాడు. దీంతో వెంటనే ఘటనాస్థలికి చేరకున్న కుమారుడు, బంధువులు ముగ్గురినీ స్థానిక ఆస్పత్రికి తరలించారు. తల్లి, కుమార్తె పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్‌కు తరలిస్తుండగా మార్గంమధ్యలో మృతిచెందారు. కృష్ణయ్య మహబూబ్‌నగర్ జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతని ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారుచేస్తున్నారు.