Saturday, November 23, 2024

గ్రూప్ 1కు దరఖాస్తుల వెల్లువ..

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో గ్రూప్-1 ఉద్యోగాలకు దరఖాస్తులు వెల్లువెత్తాయి. మంగళవారం చివరి రోజు కావడంతో.. అధిక సంఖ్యలో అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. మంగళవారం ఉదయం నుంచి గంటకు సుమారు 4 వేల చొప్పున దరఖాస్తులను సమర్పించారు. ఉదయం 9 గంటలకు 3,00,002 మంది దరఖాస్తు చేసుకోగా,సాయంత్రం 4 గంటల వరకు 3,21,704 మంది దరఖాస్తు చేసుకున్నారు. రాత్రి 8గంటల సమయానికి 3,35,143 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నట్లు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వెల్లడించింది. మంగళవారం రాత్రి 12 గంటలకు దరఖాస్తుల గడువు ముగిసింది. సోమవారం రాత్రి 10 గంటల సమయానికి 2,94,644 మంది దరఖాస్తు చేసుకోగా, మంగళవారం రాత్రి 8 గంటల వరకు 3,35,143 మంది దరఖాస్తు చేసుకున్నారు.

సుమారు ఒక రోజు వ్యవధిలో సుమారు 40,500 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. అర్ధరాత్రి 12 గంటల వరకు ఈ సంఖ్య మరింత పెరిగింది. మొత్తంగా 503 గ్రూప్-1 పోస్టులకు 3 లక్షల 50 వేల వరకు దరఖాస్తులు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటివరకు 1,80,401 మంది కొత్తగా వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకోగా, 3,67,776 మంది తమ ఒటిఆర్‌ను సవరించుకున్నారు. మొత్తం 5,48,177 మంది అభ్యర్థులు నూతన రాష్ట్రపతి ఉత్తర్వులకు అనుగుణంగా ఒటిఆర్‌ను పూర్తి చేసినట్లు కమిషన్ తెలిపింది. గ్రూప్ 1 దరఖాస్తు గడువు మరో వారం రోజులు పొడిగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. వివిధ కారణాల వల్ల దరఖాస్తు చేసుకోలేకపోయిన అభ్యర్థులకు అవకాశం కల్పించాలనే ఉద్ధేశంతో గడువు పొగించాలని టిఎస్‌పిఎస్‌సి వర్గాలు భావిస్తున్నట్లు తెలిసింది.

3 lakh more applications to TSPSC Group 1

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News