Monday, December 23, 2024

బాలీవుడ్ గాయకుడు కెకె కన్నుమూత

- Advertisement -
- Advertisement -

Singer KK dies at 53

కోల్ కతా: ప్రముఖ బాలీవుడ్ గాయకుడు కృష్ణ కుమార్ కున్నాథ్ (53) కన్నుమూశారు.  కోల్ కతాలోని ఓ హోటల్ లో కెకె కుప్పకూలిపోవడంతో స్థానిక ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అతడు మృతి చెందాడని తెలిపారు. కెకె ఢిల్లీలో జన్మించారు. 1999లో పాల్ సినిమాతో బాలీవుడ్ లో రంగప్రవేశం చేశారు. హిందీ, తమిళ, తెలుగు, కన్నడ, మళయాలం, బెంగాల్ తదితర భాషల్లో పాటలు పాడారు. కెకె మృతితో పలువురు సినీ ప్రముఖులతో పాటు అభిమానులు దిగ్భ్రాంతికి గురయ్యారు. ప్రధాని నరేంద్ర మోడీ, వీరేంద్ర సెహ్వాగ్, అక్షయ్ కుమార్ తో సహా పలువురు సంతాపం వ్యక్తం చేశారు. కెకె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని, ఓం శాంతి అని ప్రధాని మోడీ ట్వీట్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News