- Advertisement -
హైదరాబాద్: రైతులను ప్రతి ఒక్కరూ గౌరవించాలని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. వాణిజ్య పంటలు వేసేలా రైతులను ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. తెలంగాణలో బీడు భూములన్నీ పచ్చగా మారాయని మంత్రి స్పష్టం చేశారు. తెలంగాణలో గతేడాది 3 కోట్ల టన్నుల ధాన్యం ఉత్పత్తి అయిందన్నారు. ప్రజల జీవన విధానంలో, ఆహారంలో మార్పు వచ్చిందని నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. తృణధాన్యాలు, ఉద్యాన పంటలు వేయాలని ఆయన రైతులను కోరారు. ప్రస్తుతం నూనెగింజల కొరత తీవ్రంగా ఉందని చెప్పిన మంత్రి 10 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగుకు వ్యూహాత్మక అడుగులు వేస్తున్నామన్నారు. తెలంగాణ పత్తి అంటే హాట్ కేక్ లా అమ్ముడు పోతుందన్నారు.
- Advertisement -