Friday, November 22, 2024

హెచ్‌ఐవి మాత్రతో తిరిగి పెరుగుతున్న జ్ఞాపకశక్తి

- Advertisement -
- Advertisement -

Re-growing memory with the HIV pill

లాస్‌ఏంజెల్స్: హెచ్‌ఐవి చికిత్సకు ఉపయోగించే తొమ్మిది డాలర్ల విలువైన మాత్ర నడివయస్కులు, వృద్ధుల్లో కోల్పోయిన జ్ఞాపక శక్తిని తిరిగి రప్పించ గలుగుతుందని కాలిఫోర్నియా, లాస్‌ఏంజెల్స్ యూనివర్శిటీల శాస్త్రవేత్తలు వెల్లడించారు. సెల్జెంట్రీ అనే బ్రాండ్ పేరుపై విక్రయించే మారవిరక్ అనే ఔషధం నడి వయసులోని జంతువుల్లో జ్ఞాపకశక్తిని పెంపొందించిందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. హెచ్‌ఐవి వ్యాపించడానికి దోహదం చేసే కణం జన్యువును ఈ ఔషధం మార్చ గలుగుతుంది. కానీ అదే జన్యువు అవసరం లేని జ్ఞాపక కణాలను త్రుంచి పారేస్తుంది. ఫలితంగా జ్ఞాపకశక్తి పెంపొందడానికి దోహదపడుతుంది. జ్ఞాపకశక్తి కోల్పోవడాన్ని డెమెన్షియా వ్యాధి ప్రధాన లక్షణంగా వైద్యశాస్త్రంలో పరిగణిస్తున్నారు.

ఐదు మిలియన్ల కన్నా ఎక్కువ మంది అమెరికన్లు డెమెన్షియాతో బాధపడుతున్నారు. దీన్ని పూర్తిగా నివారించే ఔషధం సరైనదేదీ ఇప్పుడు అందుబాటులో లేదు. ఈ వ్యాధి వ్యాప్తిని నెమ్మది చేసే చికిత్సలు మాత్రం ఉన్నాయి. సిసిఆర్ 5 అనే జన్యువు ఎలుకల్లో అతిగా ఉత్తేజితం అయినప్పుడు అవి జ్ఞాపకశక్తిని కోల్పోతున్నాయని, జన్యువును తొలగిస్తే చక్కగా జ్ఞాపకశక్తిని కలిగి ఉంటున్నాయని ప్రయోగాల ద్వారా శాస్త్రవేత్తలు తెలుసుకున్నారు. ఇప్పుడు మారవిరక్ జౌషధంతో మనుషులపై ప్రయోగాలు చేయడానికి సిద్ధమౌతున్నట్టు ప్రొఫెసర్ ఆల్వినో సిల్వా చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News