యూనివర్సల్ హీరో కమల్ హాసన్, సక్సెస్ ఫుల్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ కాంబినేషన్‌లో తెరకెక్కిన భారీ యాక్షన్ థ్రిల్లర్ ‘విక్రమ్’. కమల్ హాసన్ తో పాటు విజయ్ సేతుపతి, ఫహద్ ఫాసిల్ ప్రధాన పాత్రలలో రూపొందిన ఈ ప్రతిష్టాత్మక చిత్రం ట్రైలర్ ఇటీవలే విడుదలై సినిమాపై భారీ అంచనాలు పెంచేసింది. జూన్ 3న విడుదల కానున్న ‘విక్రమ్’ ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది.
ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ముఖ్య అతిథిగా పాల్గొన్న వెంకటేష్ మాట్లాడుతూ.. “దక్షిణాది సినిమాలో రెండు శకాలు ఉంటే… ఒకటి కమల్‌హాసన్‌కి ముందు, మరొకటి కమల్ వచ్చిన తర్వాత అని చెప్పుకోవచ్చు. ఆయన వచ్చాక అన్ని స్టయిల్స్ మార్చేశారు. కమల్‌హాసన్ నటించిన ‘విక్రమ్’ ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను” అని అన్నారు. యూనివర్సల్ హీరో కమల్‌హాసన్ మాట్లాడుతూ.. “దాదాపు 45 ఏళ్ల క్రితం ఏయన్నార్ ‘శ్రీమంతుడు’ సినిమాకు డ్యాన్స్ అసిస్టెంట్‌గా హైదరాబాద్ వచ్చాను. అప్పటి నుంచి నేను తెలుగు ఫుడ్ తింటున్నాను. తెలుగులో నాకు ప్రేక్షకులు బిగ్గెస్ట్ హిట్స్ ఇచ్చారు. ఇక ‘విక్రమ్’ సినిమాకు మంచి టీమ్ కుదిరింది. సుధాకర్ రెడ్డి ఈ సినిమాను తెలుగులో విడుదల చేస్తున్నందుకు ఆనందంగా ఉంది” అని చెప్పారు. ఈ వేడుకలో చిత్రదర్శకుడు లోకేశ్ కనగరాజ్, సుధాకర్ రెడ్డి, నితిన్, హరీష్ శంకర్, అనిరుధ్, రామజోగయ్య శాస్త్రి తదితరులు పాల్గొన్నారు.
Venkatesh speech at VIKRAM Pre Release Event