Tuesday, December 24, 2024

మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు!

- Advertisement -
- Advertisement -

Carona Virus

న్యూఢిల్లీ: దేశంలో గత 24 గంటల్లో 3712 కరోనా కేసులు నమోదు అయ్యాయి. 5 మరణాలు కూడా సంభవించాయి. దీంతో కేంద్రం అప్రమత్తం అయ్యింది.  మహారాష్ట్ర నుంచి అత్యధికంగా 1, 081 కేసులు నమోదు అయ్యాయి.  దాదాపు 22 రోజుల తర్వాత కేసులు 3వేల మార్క్‌ దాటినట్లు కేంద్రం వెల్లడించింది. ఇక డెయిలీ పాజిటివిటీ రేటు 0.05శాతం, వీక్లీ పాజిటివిటీ రేటు 0.67గా ఉంది. యాక్టివ్‌ కేసుల సంఖ్య 19, 509గా ఉంది. ఇది కూడా ఆందోళనకు గురి చేసే అంశమని కేంద్రం పేర్కొంది. గత ఇరవై నాలుగు గంటల్లో 2, 584 మంది కోలుకున్నారు. భారత్‌లో కరోనా రికవరీ రేటు ఇప్పటిదాకా 98.74 శాతంగా ఉంది. వ్యాక్సినేషన్‌ ప్రభావంతో వైరస్‌ ప్రభావం తక్కువగా ఉందని పేర్కొంది కేంద్రం.

తమిళనాడు మంత్రి వివాదాస్పద వ్యాఖ్య

త‌మిళ‌నాడులో ఉత్త‌ర భార‌త్‌కు చెందిన విద్యార్థులు క‌రోనా వైర‌స్‌ను వ్యాపింప‌జేస్తున్నారంటూ త‌మిళ‌నాడు ఆరోగ్య శాఖ మంత్రి సుబ్ర‌మ‌ణియ‌న్ వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. తాజాగా ఆ రాష్ట్రంలోనూ వంద దాకా కొత్త కేసులు వెలుగు చూశాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News