Thursday, January 9, 2025

16600 ఎగువన ముగిసిన నిఫ్టీ!

- Advertisement -
- Advertisement -

Nifty

కోలుకున్న సూచీలు 

ముంబై: మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 436.94 పాయింట్లు లేదా 0.79% లాభపడి 55818.11 వద్ద,  నిఫ్టీ 105.20 పాయింట్లు లేదా 0.64% జోడయి  16628 వద్ద  ముగిసాయి. కాగా బెంచ్‌మార్క్ సూచీలు సానుకూల నోట్‌తో జూన్ 2న సెషన్‌ను ముగించాయి. రిలయన్స్ 3% పైగా లాభపడి 1 నెల  గరిష్ట స్థాయిని చేరుకుంది. 68 పాయింట్లతో నిఫ్టీకి ఊతం ఇచ్చింది.  హెచ్‌డిఎఫ్‌సి, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ మరియు ఐసిఐసిఐ బ్యాంకులు ప్రధానంగా నష్టపోయినవి కావడంతో ఫైనాన్షియల్స్ మార్కెట్ లాభాలను అదుపులో ఉంచాయి. దాదాపు 1919 షేర్లు పురోగమించగా, 1301 షేర్లు క్షీణించాయి ,  134 షేర్లు హెచ్చుతగ్గులు లేకుండా ముగిశాయి. సెక్టార్ల ప్రకారం చూసినప్పుడు  ఆయిల్ అండ్గ్యా స్ ఇండెక్స్ 2 శాతానికి పైగా పెరిగింది, కాగా ఆటో , క్యాపిటల్ గూడ్స్ పేర్లలో అమ్మకాలు కనిపించాయి. మిడ్‌క్యాప్ ఇండెక్స్ ఫ్లాట్‌గా ముగియగా, స్మాల్‌క్యాప్ ఇండెక్స్ అర శాతం లాభంతో ముగిసింది.

సాంకేతికంగా చూసినట్లయితే ఉదయం నష్టాలతో ఓపెన్  అయిన తర్వాత, నిఫ్టీ 16, 450 సమీపంలో మద్దతును పొందింది,  ట్రెండ్‌ను రివర్స్ చేసింది. ఇంట్రాడే చార్ట్‌లలో ఆశాజనకమైన రివర్సల్ ఫార్మేషన్ ,  డైలీ చార్ట్‌లలో లాంగ్ బుల్లిష్ క్యాండిల్ ప్రస్తుత స్థాయిల నుండి మరింత అప్‌ట్రెండ్‌ను సూచిస్తోంది. నిఫ్టీ సెషన్ అంతా సానుకూలంగా,  అస్థిరంగా కొనసాగింది. డైలీ చార్ట్‌లో, బెంచ్‌మార్క్ ఇండెక్స్ నిఫ్టీ బుల్లిష్‌నెస్‌ని సూచిస్తూ, ఆకట్టుకునే గ్రాఫ్ ఏర్పరచింది. రోజువారీ ఆర్ఎస్ఐ బుల్లిష్ క్రాస్‌ఓవర్‌లో ఉంది, పైగా పెరుగుతోంది. ఎన్ఎస్ఈలో వాల్యూమ్‌లు ఇటీవలి సగటు కంటే కొంచెం తక్కువగానే ఉన్నాయి. డే ట్రేడర్లకు 16550ను  ట్రెండ్ డిసైడర్ లెవెల్‌గా వ్యవహరించొచ్చు. ట్రెండ్ 16400 కంటే పైనా  ఉన్నంత వరకు పాజిటివ్‌గానే ఉండే అవకాశం ఉంది. ఇదిలావుండగా క్రూడ్ ధరలు తగ్గుముఖం పట్టాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News